:

2 Corinthians 2

1

మరియు నేను దుఃఖముతో మీ యొద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించు కొంటిని.

2

నేను మిమ్మును దుఃఖపరచునెల నా చేత దుఃఖపరచ బడినవాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును?

3

నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషము పొందతగినదో వారి వలన నాకు దుఃఖము కలుగకుండవలెనని ఈ సంగతి మీకు వ్రాసితిని. మరియు నా సంతోషము మీ యందరి సంతోషమేనని మీ అందరియందు నమ్మకము కలిగి ఈలాగు వ్రాసితిని.

4

"మీకు దుఃఖము కలుగవలెనని కాదు గాని మీ యెడల నాకు కలిగియున్న అత్యధికమైన ప్రేమను మీరు తెలిసికొనవలెనని, నిండు శ్రమతోను మనో వేదనతోను ఎంతో కన్నీరు విడుచుచు మీకు వ్రాసితిని."

5

"ఎవడైనను దుఃఖము కలుగజేసి యుండినయెడల, నాకు మాత్రము కాదు, కొంతమట్టుకు మీయందరికిని దుఃఖము కలుగజేసియున్నాడు. నేను విశేష భారము వాని మీద మోప గోరక ఈ మాట చెప్పుచున్నాను."

6

అట్టివానికి మీలో ఎక్కువమంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును.

7

గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేనియెడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగి పోవును.

8

కావున వాని యెడల మీ ప్రేమను స్థిరపరచవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను.

9

మీరన్ని విషయములయందును విధేయులై యున్నారేమో అని మీ యోగ్యత తెలిసికొనుటకే గదా పూర్వము వ్రాసితిని.

10

మీరు దేని గూర్చియైనను ఎవని క్షమించుచున్నారో నేనును వానిని క్షమించుచున్నాను.

11

"నేనేమైనను క్షమించియుంటే సాతాను మనలను మోసపరచ కుండునట్లు, మీ నిమిత్తము, క్రీస్తు సముఖమునందు క్షమించియున్నాను; సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము."

12

"క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువు నందు నాకు మంచి సమయము ప్రాప్తించియుండగా, సహోదరుడైన తీతు నాకు కనబడనందున."

13

నా మనస్సులో నెమ్మది లేక వారియొద్ద సెలవు తీసుకొని అక్కడ నుండి మాసిదోనియకు బయలు దేరితిని.

14

"మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు, ఆయన యందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము."

15

"రక్షింపబడువారిపట్లను, నశించువారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై యున్నాము."

16

"నశించువారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడువారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము."

17

"కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకులవలె ఉండక, నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై యుండి, క్రీస్తు నందు దేవుని యెదుట బోధించుచున్నాము."

Link: